హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట, రామంతాపూర్(బీఆర్) పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థులకు ఊరట లభించింది. పెండింగ్ ఫీజు బకాయిల కారణంగా నిలిచిపోయిన అడ్మిషన్ల సమస్యను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎక్స్ వేదికగా లేవనెత్తగా ప్రభుత్వం స్పందించి రూ.10 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తం గా డ్రా విధానంలో ఎంపికైన 56 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు పూర్తయినా, ఫీజు బకాయిల కారణం గా ప్రవేశాలు నిలిచిపోయాయి.
ఈ సమస్యను తల్లిదండ్రులు జూలై 15న ప్రవీణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ యన సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి అడ్లూరి ల క్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రు లు కూడా మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించా రు. దీంతో ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేయగా, ఆయా పాఠశాలల అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సోమవారం నుంచి పిల్లలను పాఠశాలకు తీసుకురావాలని సమాచారం ఇ చ్చారు. సమస్య పరిషారానికి కృషి చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తోపా టు సహకరించిన ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.