కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత | రాష్ట్రంలో కరోనా కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మియాపూర్లోని కల్వరి టెంపుల్లో ఏర్పాటు చేసిన 300 పడకల కొవిడ్ కేర్ సెంటర్ను ఎమ్మెల్సీ ప్రారంభించారు. అంకురా హాస్పిటల్, థెరిస్సా హాస్పిటల్ ల సౌజన్యంతో ఈ కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కరోనా పేషెంట్లకు చికిత్స, మందులు, నాణ్యమైన భోజనం సహా అన్నీ ఉచితంగానే అందించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఎక్కువ సంఖ్యలో కొవిడ్ బెడ్ లు అందుబాటులో ఉంచడంతో పాటు, ఆక్సిజన్, వెంటిలేటర్ లకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ జ్వర సర్వేను నిర్వహిస్తున్నామని కవిత స్పష్టం చేశారు. కరోనా పేషెంట్లకు ఉచితంగా భోజనం అందిస్తున్న బ్రదర్ సతీష్ ను ఎమ్మెల్సీ ఈ సందర్భంగా అభినందించారు. సోమవారం నుంచి ఇక్కడ కొవిడ్ పేషెంట్లకు చికిత్స అందించనున్నారు.
నిత్యం 100 కు పైగా వైద్య సిబ్బంది ఈ కొవిడ్ కేర్ సెంటర్ లో సేవలందించనున్నారు. 300 పడకల ఈ కొవిడ్ కేర్ సెంటర్ లో, 50 ఆక్సిజన్ బెడ్ లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్
చెక్ డ్యామ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

