మరోసారి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి
vande bharat express | సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్ - గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్ – గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో నాలుగో నంబర్ కోచ్‌లో అద్దాలు పగిలాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఈ సమయంలో దాడి జరిగింది. కోచ్ అద్దాలు పగులగా.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు.
ఇంతకు ముందు ఈ నెల 3న ఖమ్మం జిల్లాలోనూ వందేభారత్ రైలుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులను గుర్తించామని, వారికి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు జనవరిలో రైలు ప్రారంభానికి ముందే దాడి జరిగిన విషయం విధితమే. ట్రయిల్ రన్లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపలెంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

