ఫోన్ పోయిందా.. వెతికి ఇస్తాం!

- ఐఎంఈఐ నంబర్‌తో ఫిర్యాదు చేయండి
- హైదరాబాద్ నగర పోలీసుల సూచన
- ఇప్పటికే 66 మంది మొబైల్ ఫోన్లు రికవరీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): మీ ఫోన్ పోయిందా? లేదా దొంగతనం చేశారా? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఆ ఫోన్‌ను రికవరీ చేసి ఇస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఐఎంఈఐ నంబర్, ఫోన్ నంబర్ వివరాలతో సంప్రదిస్తే ఫోన్ వెతికి ఇస్తామని చెప్తున్నారు. పోగొట్టుకొన్న 66 మంది సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఐఎంఈఐ నంబర్‌తో ఫోన్ ట్రాక్ చేసి యజమానులకు అందించారు. పోగొట్టుకొన్న చోరీకి గురైన ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు నగర పోలీస్స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. హాక్-ఐ యాప్, మీసేవలోనూ లాస్ట్ ఫోన్ ఆప్షన్ ఎంచుకొని వివరాలు ఇచ్చి ఫిర్యాదు చేయొచ్చని ఆయన సూచించారు.
మీ సెల్ ఫోన్ పోయిందా.. ఇలా చేయండి:
- ఆండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్‌కు వెళ్లి ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేయాలి. మీ ఫోన్లో లాగిన్ అయిన జీమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్‌చేస్తే మీ ఫోన్ లొకేషన్‌ను చూపిస్తుంది.
- అందులో ఉన్న ఆప్షన్స్‌ను అనుసరిస్తే ఫోన్ దొరుకుతుంది.
- ఫోన్‌ను సైలెంట్లో పెట్టినా ఐదు నిమిషాల పాటు ఫోన్ రింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
- మీ ఫోన్ ఇతరుల చేతులకు వెళ్లిందనే అనుమానం ఉంటే ఎరేజ్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే ఫోన్లోని కంటెంట్ అంతా తొలగించుకోవచ్చు. స్క్రీన్ లాక్ కూడా వేసుకోవచ్చు.
- ఐఫోన్ ఉన్న వారు గూగుల్ బ్రౌజర్‌లోకి వెళ్లి ఫైండ్ మై ఫోన్ అని సెర్చ్ చేస్తే వారికి ఐక్లౌడ్ వస్తుంది. అందులో యాపిల్ ఐడీ, పాస్వర్డ్, ఇతర వివరాలు నమోదు చేస్తే ఫోన్ లొకేషన్ కనిపిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

