హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ కార్యకలాపాలను అమలు చేసేందుకు చర్యలు ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసీం తెలిపారు. సోమవారం ఎక్సైజ్ భవన్లో ఎస్ఐసీ సాంకేతిక నిపుణులు, ఎక్సైజ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని 139 ఎక్సైజ్ స్టేషన్లలో సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎన్ఐసీ చేపట్టిన నమూనాలో పలుమార్పులు సూచించారు. తుది మార్పులతో త్వరలోనే ఎక్సైజ్‌శాఖలో సాంకేతికను తీసుకొస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎన్ఐసీ డైరెక్టర్ శ్రీకాంత్, జాయింట్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఎన్‌ఫొర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవీ తదితరులు పాల్గొన్నారు.