రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరం
రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆ పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు.
- రుణమాఫీ అందరికి వర్తింపజేయాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే కూనంనేని
యాదగిరిగుట్ట, జూన్ 18 : రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆ పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. ఆ దిశగా మాజీ సీఎం కేసీఆర్ కృషి చేయాలని కోరారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను చంపి బీజేపీని బతికిస్తే మంచిది కాదని అన్నారు. ఐటీ చెల్లించే వారికి కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాము ప్రభుత్వంలో భాగమైనా ఉద్యమాలు, పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలువడం దురదృష్టకరమని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధాంతాలను మరిచాయని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకొని అధికారంలోకి వచ్చాయని విమర్శించారు. బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్‌కు కమలం పార్టీతో సంబంధం లేదని, ఆ పార్టీలో ఎంపీ కిషన్‌రెడ్డి మినహా ఎవ్వరూ బీజేపీకి చెందిన వారు కాదని చెప్పారు. టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చారని, ఆయనతోపాటు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ మాదిరిగా అధికార దాహంతో సీపీఐ ఉండబోదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

