హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఫార్మా సిటీని రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి సంబంధించిన జీవోను రద్దు చేయలేదని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్యపద్మ విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దుచేసి, అక్కడి భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం ఆమె మీడియా తో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు తర్వాత కూడా రైతుల పేర్లను అసైన్డ్ భూముల రికార్డుల నుంచి తొలగించి తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో చేర్చారని ఆరోపించారు. పట్టా భూములను ఆన్లైన్లో నమోదుచేసి, బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు.