Telangana Budget | నేడు రాష్ట్ర బడ్జెట్.. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి.. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్ర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు.
Telangana Budget | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ఆమోదించడానికి ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సమావేశంకానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై నెలాఖరుతో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
2వరకు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ఈనెల 31 వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినా, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఒత్తిడితో మరో రెండు రోజులపాటు సభను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఆగస్టు 1, 2న కూ డా సభను నిర్వహించాలని నిర్ణయించారు. రైతు భరోసా, రుణమాఫీ, స్కిల్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, వ్యవసాయ కమిషన్ తదితర వాటికి సభ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో సభను మరో రెండు రోజులు పొడిగించినట్టుగా తెలిసింది. అసెంబ్లీతో పాటుగా శాసనమండలి సమావేశాలు కూడా రెండు రోజులు జరగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

