శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9: నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కిడ్నీవాక్ (5కే) ఉత్సాహంగా సాగింది. హాస్పటల్ వద్ద ఏండీ డాక్టర్ గోపీచంద్ మన్నం వాక్‌ను ప్రారంభించగా, ఖాజగూడ పెద్దచెరువు వరకు వాక్ నిర్వహించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేని 101 ఏండ్ల అప్పసాని శేషగిరిరావు వాక్‌లో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. స్ఫూర్తిదాయకమైన జీవనశైలితో భావితరానికి ఆదర్శంగా నిలిచిన ఆయనను సన్మానించారు. కిడ్నీ సంరక్షణపై అవగాహనతో పాటు దాతృత్వం ప్రాముఖ్యతలను గుర్తించాల్సిన అవసరం ఉందని శేషగిరిరావు అన్నారు. వ్యాయామంతో ఆరోగ్యకర జీవితాన్ని గడపవచ్చని డాక్టర్ గోపిచంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ గూడపాటి, రిటైర్డ్ డీసీపీ బద్రీనాథ్ ఆర్ఎస్పీ, తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ ఈశ్వరగిరి, డాక్టర్ గందె శ్రీనివాస్, సీనియర్ కన్సల్టెంట్ నెప్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్లతో పాటు దాదాపు 1000 మందికి పైగా నగరవాసులు వాక్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.