స్టాన్ స్వామిని చంపింది మోదీ ప్రభుత్వమే : సీపీఐ(ఎం) పార్టీ
స్టాన్ స్వామి | మానవ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామిది సహజ మరణం కాదు.. ఆయనను మోదీ ప్రభుత్వమే చంపిందని సీపీఐ(మావోయిస్టు) పార్టీ ఆరోపించింది

హైదరాబాద్ : మానవ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామిది సహజ మరణం కాదు.. ఆయనను మోదీ ప్రభుత్వమే చంపిందని సీపీఐ(మావోయిస్టు) పార్టీ ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ గురువారం మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. స్వామి మరణం పార్టీ నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
ఆదివాసీల హక్కుల కోసం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల కోసం పోరాడుతున్న స్టాన్ స్వామిని, భీమా కోరేగావ్ కేసులో చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం(యూఏపీఏ) కింద మోదీ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిందన్నారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ విషయంలో బాంబే హైకోర్టు సరిగా స్పందించకపోవడం దారుణమన్నారు. అప్పటికే పార్కిన్సన్ వ్యాధితో పాటు ఇతర రోగాలతో బాధపడుతున్న స్వామిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), జైలు అధికారులు క్రూరంగా హింసించారు అని అభయ్ తన లేఖలో పేర్కొన్నారు.
కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే స్టాన్ స్వామిని మోదీ ప్రభుత్వం హత్య చేసిందన్నారు. ఆయన ఆరోగ్యం విషమిస్తున్నప్పటికీ.. బెయిల్ నిరాకరించడం దారుణం అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని కూడా వదలరని అభయ్ అన్నారు. స్వామి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

