పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
రాష్ట్రంలో పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో కనీస రహదారి సదుపాయాలతోపాటు నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా అందక యూనిట్లు మూతపడే దుస్థితికి చేరుకున్నాయని లఘు ఉద్యోగ్ భారతి (తెలంగాణ) ప్రతినిధి వై వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
- లఘు ఉద్యోగ్ భారతి (తెలంగాణ) ప్రతినిధి వై వెంకటేశ్వర్లు
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): లఘు ఉద్యోగ్ భారతి (తెలంగాణ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ‘ఎల్‌యూబీ ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా సమ్మిట్’లో ఆయన మాట్లాడుతూ… మౌలిక సదుపాయాలను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం, కేవలం పరిశ్రమల నుంచి పన్నులు వసూలు చేయడానికే ప్రాధాన్యమిస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వచ్చేలా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, మంత్రి శ్రీధర్‌బాబుపై ఉన్నదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు, వారి యూనిట్లకు ఎలాంటి భద్రత, రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా లోపం కారణంగా వ్యాపారాలు కొనసాగించలేక పారిశ్రామికవేత్తలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పేరొన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు తెలంగాణ పారిశ్రామిక విధానం ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల సమస్యలను పరిషరించేందుకు ప్రజాభవన్ వేదికగా తక్షణమే ప్రత్యేక ‘గ్రీవెన్స్ సెల్’ (ఫిర్యాదుల విభాగం)తో పాటు పారిశ్రామికవేత్తల రక్షణ కోసం సర్వీస్ సెల్ లేదా ప్రొటెక్షన్ సెల్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన శ్రీధర్‌బాబును కోరారు. మౌలిక సదుపాయాలు కల్పించి, భద్రతకు గ్యారెంటీ ఇచ్చినప్పుడే రాష్ట్రంలో నిజమైన పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతున్నదని, లేనిపక్షంలో ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు.
పూచీకత్తు లేకుండా రూ.10 కోట్ల రుణం
కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. యువ ఔత్సాహిక పారిశ్రామికులను ప్రోత్సహించేందుకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ.10 కోట్ల వరకు రుణాలు అందించేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉన్నదన్నారు. పరిశ్రమలు పెట్టెందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ ప్రాంతీయ సదస్సులో ఎంఎస్ఎంఈల ఆర్థిక వనరులు, రుణ లభ్యత, మారెట్ విస్తరణపై సమగ్రంగా చర్చించారు.
ఎంఎస్ఎంఈల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ : శ్రీధర్ బాబు
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పురోగతికి ప్రత్యేకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. లఘు ఉద్యోగ్ భారతి (తెలంగాణ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని తాజ్ డెకన్ లో శనివారం నిర్వహించిన ‘ఎల్ యూబీ ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా సమ్మిట్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విపణి అవకాశాలు, పెట్టుబడుల అనుసంధానం కల్పించి ‘మేడ్ ఇన్ తెలంగాణ‘ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేరొన్నారు.
లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలక భూమిక పోషిస్తున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ రంగాన్ని అప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని, దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేక ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చిన ఘనత తెలంగాణకే దకుతున్నదని స్పష్టం చేశారు. మారుతున్న మారెట్‌కు అనుగుణంగా నాణ్యత, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై పారిశ్రామికవేత్తలు ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు ఎదురొంటున్న సవాళ్లను గుర్తించి పరిషారం చూపేందుకు నెలకోసారి ప్రత్యేకంగా ‘ఎంఎస్ఎంఈ గ్రీవెన్స్ డే’ నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

