సోలార్ యూనిట్లకు స్త్రీనిధి రుణం
బోయే మూడు నెలల్లో తెలంగాణలోని పల్లెలు సోలార్ వెలుగులతో తళుకులీననున్నాయి. ఇప్పటివరకూ పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఇక పల్లెల్లో ఏర్పాటు కానున్నాయి. గ్రామాల్లో 10 వేల సోలార్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన రుణాన్ని అందించాలని స్త్రీనిధి సంస్థ నిర్ణయించింది
- 40 శాతం సర్కారు సబ్సిడీ, 10 శాతం పెట్టుబడి
- గ్రామాల్లో10 వేల యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం
- మండలానికి 30 చొప్పున ఏర్పాటు
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాబోయే మూడు నెలల్లో తెలంగాణలోని పల్లెలు సోలార్ వెలుగులతో తళుకులీననున్నాయి. ఇప్పటివరకూ పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఇక పల్లెల్లో ఏర్పాటు కానున్నాయి. గ్రామాల్లో 10 వేల సోలార్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన రుణాన్ని అందించాలని స్త్రీనిధి సంస్థ నిర్ణయించింది. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఇండ్లకు సోలార్ యూనిట్లను అమర్చేందుకు అవసరమైన రుణాన్ని అందించనున్నది. మొదటి దశలో 300 మండలాల్లో మండలానికి కనీసం 30 యూనిట్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..
మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సభ్యుల్లో అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. వీరికి అవసరమైన ఆర్థిక సాయాన్ని స్త్రీనిధి రుణం రూపంలో ఇవ్వనుంది. యూనిట్‌కు 40 శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10 శాతం లబ్ధిదారుడు చెల్లించాలి. 50 శాతాన్ని స్త్రీనిధి రుణంగా అందిస్తుంది. ఈ రుణాన్ని ఐదేండ్లలో చెల్లించే వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు కచ్చితంగా ఆర్సీసీ బిల్డింగ్ ఉండాలి. స్లాబ్ కనీసం 160 చదరపు అడుగుల నుంచి 200 చదరపు అడుగులకు పైగా ఉండాలి. నెలకు కనీసం 200-300 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారై ఉండాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

