హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ సీట్ల భర్తీలో భాగంగా ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీట్లు మార్చుకున్న విద్యార్థులకు సర్కారు శుభవార్త చెప్పింది. వారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తుంది. ఇది వరకు ఇంటర్నల్ ైస్లెడింగ్ను కాలేజీలే నిర్వహించేవి. దీంతో ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేదికాదు. ఇప్పటికే పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ముగియగా, తాజాగా కన్వీనర్ కోటాలో ఇంటర్నల్ స్లైడింగ్ సోమవారం నుంచి మొదలుకానుంది.
సోమ, మంగళవారాల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశామిచ్చారు. 8న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు 8, 9న కాలేజీల్లో రిపోర్టుచేయాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. 8న నోటీసుబోర్డుపై ఖాళీలను ప్రదర్శించి అదే రోజు నుంచి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 12న స్పాట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలకు https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన సూచించారు.