e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home తెలంగాణ వామన్‌రావు కేసు విచారణకు ప్రత్యేక కోర్టు!

వామన్‌రావు కేసు విచారణకు ప్రత్యేక కోర్టు!

వామన్‌రావు కేసు విచారణకు ప్రత్యేక కోర్టు!


హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేఖ
హైదరాబాద్‌, మే 8 (నమస్తే తెలంగాణ): న్యాయవాది గట్టు వామనరావు, పీవీ నాగమణి దంపతుల హత్యకేసు విచారణకు ప్రత్యేకకోర్టును ఏర్పాటు చేయాలని హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం లేఖ రాసింది. విచారణను సత్వరమే పూర్తి చేసేందుకు కరీంనగర్‌ సెషన్స్‌ కోర్టును ప్రత్యేక కోర్టుగా పరిగణించాలని కోరింది. డీజీపీ అభ్యర్థనకు అనుగుణంగా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వరరెడ్డికి న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాశారు. వామనరావు దంపతులపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని వామనరావు తండ్రి కిషన్‌రావు హై కోర్టును ఆశ్రయించగా, తామే స్వయంగా విచారణ చేస్తున్నామని, సీబీఐ దర్యాప్తు అవసరం తెలిపింది. సాక్ష్యాల సేకరణ, నిందితుల వాంగ్మూలాల నమో దు వంటి చర్యలపై పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగానే ఉందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వామన్‌రావు కేసు విచారణకు ప్రత్యేక కోర్టు!

ట్రెండింగ్‌

Advertisement