రేపు విడుదల కానున్న నోటిఫికేషన్
దరఖాస్తుల స్వీకరణా రేపటి నుంచే
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఇటీవలే 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 1,271 పో స్టుల భర్తీకి సిద్ధమైంది.
బుధవారం నోటిఫికేషన్ను ఎస్పీడీసీఎల్ విడుదల చేయనున్నది. అదే రోజు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నది. ఇందులో జూనియర్ లైన్మెన్, సబ్ ఇం జినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఐటీఐ, బీఈ, బీటెక్ అభ్యర్థులు వీటికి అర్హులు. వివరాలకు https://tssouthernpower. com, www.tssouthernpower.cgg.in వెబ్సైట్ను సంప్రదించాలి.