Solar Pumpsets | వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు.. అధికారులకు రెడ్కో సీఎండీ కీలక ఆదేశాలు
Solar Pumpsets | రాష్ట్రంలో సాగుకు సోలార్ పంపుసెట్లను అందించనున్నట్టు రెడ్కో సీఎండీ జితేశ్ వీ పాటిల్ వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన సోలార్ పంపుసెట్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Solar Pumpsets | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగుకు సోలార్ పంపుసెట్లను అందించనున్నట్టు రెడ్కో సీఎండీ జితేశ్ వీ పాటిల్ వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన సోలార్ పంపుసెట్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
టీజీ రెడ్కో వీసీ, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సోమవారం ఆ సంస్థ అధికారులు, జిల్లా మేనేజర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన పథకాల అమలును వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. మాడల్ సోలార్ విలేజ్, రూఫ్‌టాప్ సోలార్, పీఎం కుసుమ్ పథకం, వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్, ఎలక్ట్రికల్ వాహన చార్జింగ్ స్టేషన్లపై ఆయన ఆరా తీశారు.
గృహజ్యోతి ఇండ్లపై సోలార్ ప్లాంట్లురూఫ్టాప్ సోలార్ పథకంలో భాగంగా గృహజ్యోతి పథకం కింద నిర్మించిన ఇండ్లపై విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రెడ్కో సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆసక్తి చూపిన వారి ఇండ్లపై ప్లాంట్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పీఎం కుసుమ్ లక్ష్యాల సాధనకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో రెడ్కో జీఎం సీఎస్వీ ప్రసాద్, జిల్లా మేనేజర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఏపీ హోం మంత్రి అనిత
Silver Foil | స్వీట్లపై పైపూతగా ఉపయోగించే వెండి రేకులను తినకూడదా.. అసలు నిజం ఏమిటి..?
RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Bael Tree | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడు అవుతాడట తెలుసా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

