Snake in MGM | ఎంజీఎం రేడియాలజీ విభాగంలో పాము కలకలం
Snake in MGM | ఎంజీఎం హాస్పిటల్లో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం రేడియాలజీ విభాగం(రూమ్ నంబర్ 92) లో పాము ప్రత్యక్షం కావడంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయి పరుగులు తీశారు.
Snake in MGM | వరంగల్ చౌరస్తా : ఎంజీఎం హాస్పిటల్లో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం రేడియాలజీ విభాగం(రూమ్ నంబర్ 92) లో పాము ప్రత్యక్షం కావడంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయి పరుగులు తీశారు. ఓపీ సేవలు కొనసాగే సమయం కావడంతో రేడియాలజీ విభాగంలో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇదే సమయంలోనే పాము కనిపించడంతో కొంత సేపటి వరకు రోగులు, సిబ్బంది లోపలికి వెళ్లేందుకు భయపడ్డారు.
సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది పాముని గుర్తించి పట్టుకొని, అనంతరం నిర్జన ప్రదేశానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎంజీఎం హాస్పిటల్ ఆవరణ పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో పాములకు ఆవాసంగా మారడంతో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయని, గతంలో వరుస రెండు దినాల్లో రెండు పాములు వార్డుల్లో కనిపించడం వ్యవస్థ పనితీరును చూపిస్తుందని, అధికారులు స్పందించి శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరచినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రోగులు, సిబ్బంది భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

