హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులోని పలు ప్యాకేజీల టెండర్లపై నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని కమిషర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ) నిర్ణయించింది. సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో శనివారం సీవోటీ సమావేశం జరిగింది. సీతారామ ప్రాజెక్టు పెండింగ్ డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు చేపట్టాలని గతంలోనే నిర్ణయించగా టెండర్లపై సీవోటీలో చర్చించారు. తుదిఆమోదం కోసం టెండర్లను ప్రభుత్వానికే పంపించాలని సీవోటీ నిర్ణయించింది. మరిన్ని ప్రాజెక్టుల టెంబర్లపైనా చర్చించి, వాటిని కూడా ప్రభుత్వానికే పంపాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
భద్రకాళి చెరువు పూడికతీతకు మార్గదర్శకాలు
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వరంగల్ భద్రకాళి చెరువులో పూడికతీతకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.11.16 కోట్లతో పూడికతీత, తరలింపు, సమాచార నిర్వహణ బాధ్యతను వరంగల్ సీఈకి అప్పగించింది. రెవెన్యూ అధికారులతో కలిసి పనులను నిర్వహించాలని ఆదేశించింది. పూడికతీత ఫొటోలు తీయాలని సూచించింది.