కవల అక్కాచెల్లెళ్లకు కవలలు

- ఒకే కాన్పులో అక్కకు నలుగురు.. చెల్లికి ముగ్గురు శిశువులు
- 3 నెలల కింద ముగ్గురికి జన్మనిచ్చిన చెల్లె.. శనివారం అక్క నలుగురికి జననం
విద్యానగర్, ఆగస్టు 21: వారిద్దరూ కవల అక్కాచెల్లెళ్లు. చిన్ననాటి నుంచి ఒకే తరహాలో పెరిగిన వారిద్దరు.. వివాహాలయ్యాక కవల పిల్లలకు జన్మనిచ్చారు. మూడు నెలల కింద చెల్లె ముగ్గురికి (ట్రిపులెట్స్), శనివారం అక్క నలుగురు శిశువుల (క్వాడ్రుప్లెట్స్)కు జన్మనిచ్చిన అరుదైన ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. కవలలైన తమ బిడ్డలు మళ్లీ కవలలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన పబ్బ శ్రీలత, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కవల ఆడ పిల్లలు జన్మించారు. పెద్ద పాపకు నిఖిత, చిన్న పాపకు లిఖిత అని పేర్లు పెట్టారు. నిఖితను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాలకు చెందిన సాయికిరణ్‌కు, లిఖితను రామడుగు మండలం వెలిచాలకు చెందిన రాకేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. మూడు నెలల కిందట కరీంనగర్‌లోని యశోదకృష్ణ దవాఖానలో లిఖిత ఒకే కాన్పులో ఇద్దరు మగ, ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చింది. తాజాగా, శనివారం నిఖిత కూడా అదే దవాఖానలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ఇద్దరి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ ఆకుల శైలజ తెలిపారు. ఏడెనిమిది లక్షల్లో ఒకరిద్దరికి జన్యు ప్రభావంతో ఇలాంటి అరుదైన జననాలు జరుగుతాయని చెప్పారు. తమ ఇద్దరు కవల పిల్లల్లో ఒకరికి ముగ్గురు, మరొకరికి నలుగురు పిల్లలు జన్మించడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Karimnagar district
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

