పాడెపైనే తమ్ముడికి రక్షాబంధనం
రాఖీ పండుగకు తమ్ముడికి రక్షాబంధనం కట్టి, మిఠాయి తినిపించాలని ఆశపడిన ఆ అకకు విధి తీరని విషాదాన్ని మిగిల్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేశ్ (34) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన అంతిమయాత్రలో భాగంగా దింపుడుగళ్లెం వద్దకు మృతదేహాన్ని తీసుకురాగా.. రమేశ్ అక ధనలక్ష్మి తన తమ్ముడిని చూసి గుండెలవిసేలా రోదించింది.
- మహబూబాబాద్ జిల్లా కంటతడి పెట్టించిన ఘటన
కురవి, ఆగస్టు 26 : రాఖీ పండుగకు తమ్ముడికి రక్షాబంధనం కట్టి, మిఠాయి తినిపించాలని ఆశపడిన ఆ అకకు విధి తీరని విషాదాన్ని మిగిల్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేశ్ (34) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన అంతిమయాత్రలో భాగంగా దింపుడుగళ్లెం వద్దకు మృతదేహాన్ని తీసుకురాగా.. రమేశ్ అక ధనలక్ష్మి తన తమ్ముడిని చూసి గుండెలవిసేలా రోదించింది. పుట్టెడు దుఃఖంతో పాడెపై ఉన్న తమ్ముడి చేతికి రాఖీ కట్టింది.
కుటుంబాన్ని వెంటాడుతున్న విషాదం..
రమేశ్ తండ్రి పదిరోజుల క్రితం మృతి చెందాడు. ఆయన దశదినకర్మ గురువారం నిర్వహించాల్సి ఉండగా.. ఇంతలోనే రమేశ్ మృతిచెందడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. గతంలో రమేశ్ తమ్ముడు కూడా అనారోగ్యంతో మృతిచెందినట్టు బంధువులు తెలిపారు. ఒకే కుటుంబంలో వరుస మరణాలు చోటుచేసుకోవడంతో బంధువులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

