సింగరేణి లాభాలు ఢమాల్
రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం సంస్థ అయిన సింగరేణి కాలరీస్ లాభాలు భారీగా పడిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాన్ని గడించిన ఈ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంల కేవలం రూ.1,754 కోట్లకే పరిమితమయ్యింది. అంటే ఏడాది వ్యవధిలోనే లాభం రూ.4,640 కోట్లు (72.6%) తగ్గింది. గత నాలుగేండ్లలో ఇదే అతి తక్కువ వార్షిక లాభం.
- ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
- ఈ ఏడాది లాభం రూ.1,754 కోట్లే
- ఏకంగా 72 శాతం క్షీణించిన వైనం
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం సంస్థ అయిన సింగరేణి కాలరీస్ లాభాలు భారీగా పడిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాన్ని గడించిన ఈ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంల కేవలం రూ.1,754 కోట్లకే పరిమితమయ్యింది. అంటే ఏడాది వ్యవధిలోనే లాభం రూ.4,640 కోట్లు (72.6%) తగ్గింది. గత నాలుగేండ్లలో ఇదే అతి తక్కువ వార్షిక లాభం.
ఇదే సమయంలో ఔట్‌ఫుట్ ఫర్ మ్యాన్షిష్ట్ భారీగా పెరిగింది. గతంలో 6.39 టన్నులుగా ఉన్న ఇది ఈ ఏడాది 7.56 టన్నులకు పెరిగింది. అయినప్పటికీ సింగరేణి లాభాలు పెరుగకపోవడం గమనార్హం. 2022-23లో రూ.2,022 కోట్లుగా ఉన్న సింగరేణి లాభం 2023-24లో ఏకంగా 50% పెరిగి రూ.4,712 కోట్లకు దూసుకెళ్లింది. 2024-25లో లాభం మరో రూ.1,682 కోట్లు పెరిగి రూ.6,394 కోట్లకు చేరింది. అక్కడి నుంచి సింగరేణి లాభాల గ్రాఫ్ తల్లకిందులైంది. కేవలం ఏడాదిలోనే లాభం రూ.1,754 కోట్లకు పడిపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
సంపదకు గండి..
కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టాక సింగరేణిని నిర్వీర్యం చేసింది. ఆ సంస్థ ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడంతోపాటు ఏకంగా రూ.1,600 కోట్లకుపైగా విలువైన 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేసింది. సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసి కాంట్రాక్టర్లను భయపెట్టింది. ఈ నిబంధన ఫలితంగా కాంట్రాక్టర్లు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సింగరేణి వార్షిక టర్నోవర్ తగ్గింది. తద్వారా సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది.
గతంలో రూ.37 వేల కోట్లుగా ఉన్న సింగరేణి టర్నోవర్ ఇప్పుడు రూ.30 వేల కోట్లకు పడిపోయింది. సంస్థకు రావాల్సిన బకాయిలు నెలకు రూ.1,000 కోట్ల చొప్పున పేరుకుపోతున్నాయి. గతంలో ఏడాదికి రూ.2 వేల కోట్లలోపు ఉన్న బకాయిలు గత 33 నెలల్లో 33వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సింగరేణి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి సంస్థ ఆర్థికంగా కుదేలవుతున్నది. ప్రస్తుతం ఓవర్‌డ్రాఫ్ట్ మీద నడుస్తున్న సింగరేణి ప్రతి నెలా తమ సిబ్బంది జీతాలు చెల్లించేందుకు బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నది.
ఫుట్‌బాల్ సోకులకు
జెన్కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు గుట్టల్లా పేరుకుపోయి రూ.59 వేల కోట్లకు చేరాయి. గత రెండున్నరేండ్ల కాలంలో ఆ సంస్థలు సింగరేణికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇంత గడ్డు పరిస్థితిలో కూడా సింగరేణి సొమ్మును కాంగ్రెస్ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నది. దీనిలో భాగంగా ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లను సీఎం ఫుట్‌బాల్ సోకులకు వాడుకున్నది. అంతటితో ఆగకుండా రూ.480 కోట్ల సింగరేణి సొమ్మును ఇటీవల యంగ్ ఇండియా గురుకులాలకు మళ్లించింది.
కుంభకోణాలకు చిరునామా
సింగరేణిని రేవంత్‌రెడ్డి సర్కార్ కుంభకోణాలకు చిరునామాగా మార్చింది. ఓబీ టెండర్ల స్కామ్, డిటోనేటర్ల స్కామ్ ద్వారా రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. ఒక్కో డిటోనేటర్‌ను రూ.300 అదనంగా చెల్లించి కొనుగోలు చేశారని, ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజస్థాన్ పవర్ ప్రాజెక్టుల విషయంలోనూ అనేక ఆరోపణలొచ్చాయి. 800 మెగావాట్ల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సోలార్ ప్లాంట్లకు సంబంధించి పీపీఏలు కుదుర్చుకోకపోవడంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ప్లాంట్లు వృథాగా పడి ఉన్నాయి. ఓపెన్ కాస్టుల్లో బొగ్గు వెలికితీతకు హెవీ మెషినరీ కొనుగోలు చేయకుండా ప్రైవేట్ సంస్థను ప్రోత్సహిస్తున్నారు. పరికరాలు లేకపోవడం, స్పేర్‌పార్టులు కొనుగోలు చేయకపోవడం సింగరేణి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
గత నాలుగేండ్లలో సింగరేణి లాభాలు
సంవత్సరం : లాభం (రూ.కోట్లలో)
2022-23 : 2,022
2023-24 : 4,712
2024-25 : 6,394
2025-26 : 1,754
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

