హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఫ్యాషన్ డిజైనింగ్.. గార్మెంట్ మేకింగ్.. ఫ్యాబ్రిక్ డిజైన్ పెయింటింగ్.. ఇటీవల డిజైనింగ్ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సులు. ఈ కోర్సుల్లో చేరాలంటే సాధారణంగా ఎంట్రెన్స్ రాయాలి. వేల మంది పోటీని తట్టుకోవాలి. నిఫ్ట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అడ్మిషన్ పొందాలి. కానీ, ప్రవేశ పరీక్షతో నిమిత్తం లేకుండా.. పోటీ పడకుండానే ఇలాంటి కోర్సులను పూర్తిచేసే అవకాశాన్ని మన తెలంగాణ ఇంటర్ విద్య అధికారులు కల్పిస్తున్నారు. షార్ట్‌టర్మ్ వొకేషనల్ కోర్సు (ఎస్ఐవీఈ)ల్లో భాగంగా 53 రకాల కోర్సులను 47 జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్, పైథాన్ అండ్ కోడింగ్, క్యాడ్, ల్యాండ్ సర్వేయర్, లీగల్ అసిస్టెంట్, ట్యాక్సేషన్, డెంటల్ సిరామిక్ అసిస్టెంట్, డెంటల్ హైజీన్ అసిస్టెంట్, డయాలసిస్ అసిస్టెంట్, మిడ్వైఫ్రీ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ప్లెబాటమీ (శాంపిల్ కలెక్షన్) వంటి కోర్సులను నిర్వహిస్తున్నారు. వీటిని అతి తక్కువ కాలంలో టకాటక్ పూర్తిచేసి, ప్లేస్మెంట్ డ్రైవ్‌లో ఫటాఫట్ ఉద్యోగం పొందవచ్చు. ఇటీవల అనేక మంది యువకులు ఇలాంటి స్వల్పకాల కోర్సులు పూర్తిచేసి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మార్కెటింగ్ అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యాసంవత్సరం అధికారులు కొత్తగా మరో 11 కోర్సులను తీసుకొచ్చారు. కోర్సులు, ఇతర వివరాలకు www.sive.telangana.gov.in వెబ్సైట్ చూడాలని అధికారులు సూచించారు.
అఫిలియేషన్లకు దరఖాస్తులు
స్పల్పకాలిక వృత్తివిద్యా కోర్సులను నిర్వహణకు కాలేజీలకు ఇంటర్మీడియట్ విద్య కమిషనరేట్ అఫిలియేషన్ ఇవ్వనున్నది. ఇందుకు యాజమాన్యాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కాంపోజిట్ కాలేజీలు, ఎన్జీవోలు, సొసైటీలు, సహకార సంస్థలు సోమవారం నుంచి జూలై 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, అధికారులతో తనిఖీలు నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు www.sive.telan gana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
ప్రత్యేకతలు..