Shri Ananth Padmanabhaswamy | శేషతల్పంపై పవళించిన అనంతపద్మనాభస్వామి విగ్రహాన్ని హైదరాబాద్కు చెందిన శివనారాయణ్ జ్యువెలర్స్ రూపొందించారు. రెండున్నర కిలోల బంగారం, 75వేల వజ్రాలతో రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని తయారుచేయడానికి 32 మంది కళాకారులు రోజుకు 16 గంటల చొప్పున రెండు నెలలపాటు శ్రమించారు.
ఒకటిన్నర అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో-2023లో ఇటీవల ప్రదర్శించారు.