మంథని, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) సలహా కమిటీ సభ్యుడిగా మంథనికి చెందిన న్యాయవాది, రైతు నేత శశిభూషణ్ కాచే నియమితులయ్యారు. ఈ మేరకు కమిషన్ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ రంగాలకు చెందిన 13 మందితో కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ సెప్టెంబర్ 8న గెజిట్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ మూడేండ్ల పాటు కొనసాగనున్నది. తన నియామకానికి సహకరించిన చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు కాచే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.