Siddipeta | విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు సస్పెండ్
Siddipeta | దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అమ్మన సంజీవ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం మత్తులో ఉపాధ్యాయుడు సంజీవ్‌రెడ్డి విద్యార్థులను

సిద్దిపేట : దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అమ్మన సంజీవ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం మత్తులో ఉపాధ్యాయుడు సంజీవ్‌రెడ్డి విద్యార్థులను చితకబాదిన విషయం విదితమే.
ఎస్జీటీగా పని చేస్తున్న సంజీవ్‌రెడ్డి శుక్రవారం మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో విద్యార్థులను దూషించడంతోపాటు పాశవికంగా దాడిచేశాడు. 2, 3వ తరగతులకు చెందిన 15 మందిని కర్రతో కొట్టడమే గాక పిల్లల బుగ్గలపై గిచ్చి కర్కశత్వంగా ప్రవర్తించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన పిల్లల ముఖాలపై గాయాలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గ్రామస్థులతో కలిసి పాఠశాలకు వెళ్లేసరికి ఆ ఉపాధ్యాయుడు జారుకున్నాడు. చిన్నారులను తిమ్మాపూర్ పీహెచ్‌సీకి తరలించారు. విషయాన్ని సర్పంచ్ పరశురాములు దుబ్బాక జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి ద్వారా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు. డీఈవో ఆదేశాలతో ఎంఈవో ప్రభుదాస్ దవాఖానకు వెళ్లి విద్యార్థుల పరిస్థితిని చూసి చలించిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

