హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): హాలియా పట్టణంలో షాదీఖానా ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కోరారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి నియోజవర్గ పరిధిలో ముస్లిం మైనార్టీలు, ఎస్సీల సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. తక్షణమే షాదీఖానాకు నిధులు మం జూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.