మంత్రి ఇలాకాలో రోడ్డెక్కిన దసలి పట్టు రైతులు
దసలి పట్టు రైతుల మీద ఆంక్షలు విధించడం ఏమిటని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.
- అటవీ అధికారుల ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్
చెన్నూర్ రూరల్, అక్టోబర్ 28: మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాకా చెన్నూర్ నియోజకవర్గంలో దసలి పట్టు పురుగుల పెంపకాన్ని అడ్డుకుంటూ అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించడంతో బుధవారం చెన్నూర్ మండలంలోని కిష్టంపేట జాతీయ రహదారిపై పట్టు రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో పట్టు పురుగులు పెంచవద్దంటూ అటవీ ప్రాంతానికి వెళ్లే దారిని అధికారులు మూసివేశారని తెలిపారు. దసలి పట్టు రైతుల మీద ఆంక్షలు విధించడం ఏమిటని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.
మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పట్టు రైతుల గోసను మంత్రి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ వచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని భీష్మించారు. ఆందోళనకు మద్దతుగా పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. చెన్నూర్ ఎస్సై శ్యాం పటేల్ చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామనడంతో రైతులు ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

