జయేశ్ రంజన్ వీఆర్ఎస్.. రిజ్వీ బాటలోనే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ
రాష్ట్ర సర్వీసుల నుంచి ఒక్కొక్కరుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు పక్కకు తప్పుకొంటున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌లో పనిచేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చే ఒత్తిడులు తట్టుకోలేని,
- వీలైనంత త్వరగా రిలీవ్ చేయాలని దరఖాస్తు
- రేవంత్ సర్కార్‌లో పనిచేయలేమంటూ తప్పుకొంటున్న సీనియర్ ఐఏఎస్‌లు
హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్వీసుల నుంచి ఒక్కొక్కరుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు పక్కకు తప్పుకొంటున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌లో పనిచేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చే ఒత్తిడులు తట్టుకోలేని, పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసుకోలేని అధికారులు ఎంతో కఠోర పరిశ్రమతో సాధించిన ఐఏఎస్‌కే రాజీనామా చేస్తున్నారు. ఐఏఎస్‌ను సాధించడం కోసం తీవ్రంగా కష్టపడి, ప్రభుత్వ యంత్రాంగంలో కీలకంగామారి ఎన్నో మంచి పనులు చేసి సర్కార్ ప్రతిష్టను పెంచి ప్రజల మన్ననలు పొందే అధికారులు ఇప్పుడు రేవంత్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు సీనియర్ అధికారులు గత ఏడాది కాలంలో స్వచ్చంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో సయ్యద్ ముర్తుజా రిజ్వీ ఒకరు కాగా తాజాగా ఇదే దారిలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జయేశ్ రంజన్ మరొకరు. 1992వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్ స్వచ్చంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన తన దరఖాస్తును కేంద్ర డీవోపీటికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన వీఆర్ఎస్కు ఆమోదం తెలిపినట్టు తెల్సింది. ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉన్నది. 1967 సెప్టెంబర్‌లో జన్మించిన జయేశ్‌రంజన్‌కు మరో ఏడాది వరకు పనిచేసే అవకాశం ఉన్నది. అయితే, ఆయన ముందే రాజీనామాకు సిద్ధపడ్డారు.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇవ్వక అవమానం
రాష్ట్రంలో అత్యంత సమర్థుడిగా, పరిశ్రమలు, ముఖ్యంగా ఐటీ పరిశ్రమ విస్తరించడంలో కీలకపాత్ర పోషించిన జయేశ్‌రంజన్ వివాదరహితుడు. వృత్తిలో ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తారన్న పేరుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లపాటు ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని పెద్ద కంపెనీల పెట్టుబడులు హైదరాబాద్‌కు వచ్చేందుకు కృషిచేశారు. దేశవిదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు ప్రయత్నించారు. 1994లో విశాఖపట్నం సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన గిరిజన సంక్షేమ శాఖ, పేదరిక నిర్మూలన సంస్థలు, కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి సంస్థలకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు, కడప జిల్లా కలెక్టర్‌గా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్‌గా, పర్యాటకశాఖ ఎండీగా, కార్యదర్శిగా పనిచేశారు.
పరిశ్రమల శాఖలో ఏపీఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి 2024 వరకు ఐటీ, పరిశ్రమల శాఖలో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత పట్టణాభివృద్ది సంస్థ ప్రత్యేక కార్యదర్శిగా, ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ సెల్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. ఆయా శాఖల్లో తనదైన ముద్ర వేశారు. కేసీఆర్ హయాంలో ఐటీ రంగంలో మాజీ మంత్రి కేటీఆర్ తీసుకున్న అనేక విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో అనేక కీలక పదవులు నిర్వహించిన జయేశ్‌రంజన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పదవికి అర్హుడు. అలాంటిది కానీ ఆయనకు ఆ ఉద్యోగ దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడూ తెలంగాణలో పనిచేయని సంజయ్జాజూకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. ఇది చర్చకు దారి తీసింది.
రేవంత్ సర్కార్‌లో సరైన పోస్టింగే లేదు
రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత రేవంత్‌రెడ్డి సర్కారు జయేశ్‌రంజన్ ప్రాధాన్యతను తగ్గించింది. ఆయనను ఐటీ, పరిశ్రమల శాఖ నుంచి తప్పించింది. సీఎం చేజింగ్ సెల్ అని, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటూ ఏవేవో పోస్టుల్లో పెట్టి ఆయన విసిగిపోయేలా చేసినట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

