గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 20, 2020 , 19:43:39

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సీనియర్‌ ఐఏఎస్‌ హర్పిత్సింగ్‌

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సీనియర్‌ ఐఏఎస్‌ హర్పిత్సింగ్‌

హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హర్పిత్సింగ్‌ గురువారం మొక్కలు నాటారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో బతుకమ్మ కుంట దగ్గర ఆయన మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురిని గ్రీన్‌ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌ హర్పిత్సింగ్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. చెట్లు నీడను, మంచి ఆక్సిజన్‌ ఇవ్వడంతో పాటు ఇతర జీవరాశికి బ్రతుకునిస్తాయన్నారు చెట్ల ద్వారా మన చుట్టూ ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న 172 మంది ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఎంఈసీ వాళ్లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ ప్రాధాన్యతను వివరించనున్నట్లు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్‌ఆర్డీ అడిషనల్‌ డైరక్టర్‌ జనరల్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌, ఐటీ డైరక్టర్‌ శ్రీదేవీ అయలూరి, సీనియర్‌ ఫ్యాకల్టీ అబ్బాస్‌ అలీ పాల్గొన్నారు.





logo