హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం గ్రామాలకు తాగునీటి సరఫరా కొనసాగుతున్నదని, మిగిలిన ప్రాంతాల్లోనూ సమస్యలు వెంటనే పరిషరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిష న్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సచివాలయంలో శనివా రం మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ప్రతిరోజూ స మీక్ష నిర్వహిస్తూ, అవసరమైన ప్రత్యామ్నా య చర్యలను ముందుగానే సిద్ధం చేయాలని కోరారు. సింగూరు, పాలేరు వంటి రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గినప్పటికీ, వచ్చే 100 రోజులపాటు ఎలాంటి తాగునీటి సమ స్య రాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు వివరించగా, దానిని కచ్చితంగా అమలు చే యాలని మంత్రి ఆదేశించారు.
16వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సమీక్షలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
పట్టణ ప్రాంత రోడ్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్రామీణ రహదారుల నిర్మాణం లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) వి ధానాన్ని చేపట్టినట్టు మంత్రి సీతక చెప్పా రు. సచివాలయంలో శనివారం గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్షించారు. హ్యామ్ మోడల్లో మొత్తంగా 6,703 గ్రామాల్లో 18,472 కి.మీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు.