ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం.. జూరాలపై రాకపోకలు నిషేధం
నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

మహబూబ్‌నగర్: కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల ప్రాజెక్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గురువారం ఉదయం నుంచి జూరాల ఆనకట్టపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రెండు రోజుల క్రితం జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు జలవిద్యుత్ కేంద్రాన్ని, జూరాల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.
ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రాజెక్టు వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జూరాల మీద పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేశారు. పరిసర ప్రాంతాల వారిని, జూరాల మీదుగావెళ్లే వారి ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న గేట్లకు తాళాలు వేశారు.
అదేవిధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. సాగర్ బ్రిడ్జి వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయం వద్ద కూడా బందోబస్తు అధికం చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక దళాలతో బందోబస్సు ఏర్పాటు చేశారు. అదేవిధంగా శ్రీశైలం డ్యాం ఎడమగట్టు గేటు వద్ద తెలంగాణ పోలీసులు బందోబస్తు పెంచారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

