బోనమెత్తిన లష్కర్
లష్కర్| సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి ఆలయానికి బారులుతీరారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా 2,500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. మాస్కు ధరించని వారిని అమ్మవారి దర్శనం కోసం అనుమతించమని పోలీసులు తెలిపారు. ఇవాళ సీఎం కేసీఆర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సోమవారం రంగం వేడుక నిర్వహించనున్నారు.


ఈ ఏడాది బోనాల జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణకు రూ.15 కోట్లు కేటాయించింది. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేసింది. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

