Bharat Gaurav Train | 18 నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు.. 8 రాత్రులు, 9 పగళ్లు పుణ్యక్షేత్రాల్లో యాత్ర
Bharat Gaurav Train | ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆర్ జోన్ల్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు.
Bharat Gaurav Train | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ తొలి రైలు ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభంకానున్నదని ఎస్సీఆర్ జోన్ల్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భారత్ గౌరవ్ రైలు యాత్ర గురించి వివరించారు. దేశంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించడం, వాటి ప్రాముఖ్యత గురించి ప్రయాణిలకు చాటి చెప్పాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ రైలు ప్రయాణానికి పూరి- కాశీ- అయోధ్య పుణ్యక్షేత్ర యాత్రగా పేరు పెట్టినట్టు తెలిపారు.
18 నుంచి ప్రారంభంకానున్న ఈ రైలు ఈ నెల 26 వరకు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుందని చెప్పారు. ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగటిపూటలు ఇది కొనసాగుతుందని తెలిపారు. పూరి, కోణార్క్, గయ, వారణాసి, ఆయోధ్య, ప్రయాగరాజ్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాల గుండా కొనసాగనున్నదని వివరించారు. సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్ల నుంచి తెలుగు రాష్ర్టాల ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించే వీలు కలుగుతుందని తెలిపారు. ఇందులో మొత్తం 700 సీట్లు ఉండగా, వాటిలో స్లీపర్లు 460, థర్డ్ ఏసీ 192, ఏసీ 48 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీఆర్ ఏజీఎం ఉదయ్‌కుమార్‌రెడ్డి, సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్‌కుమార్ గుప్తా, ఐఆర్సీటీసీ గ్రూప్ మేనేజర్ పీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

