ఐదు రైల్వే స్టేషన్లలో చేనేత ఎగ్జిబిషన్-కమ్-సేల్ స్టాళ్ల ఏర్పాటు

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు రైల్వే స్టేషన్లలో చేనేత వస్త్రాల తాత్కాలిక ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మూడు, ఏపీలోని రెండు రైల్వే స్టేషన్లలో ప్రభుత్వ సంస్థల చేనేత/ఖాదీ ఉత్పత్తులను ప్రదర్శించడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ చేనేత వస్త్రాల స్టాళ్లు కొలువుదీరాయి. సికింద్రాబాద్, కాచిగూడలో ఆగస్టు 22 వరకు, హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఆగస్టు 19 వరకు స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనుగోలుదారులు ఈ స్టాళ్లను సందర్శించి కొనుగోలు చేయవచ్చు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్మరించుకొని, ఆత్మనిర్భర్ భారత్ భావనను చిత్రీకరించే క్రమంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఐదు రైల్వే స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా 75 ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఈ స్టాల్లను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

