హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): విపక్షాల ఐక్యతకు, అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు శాస్త్రీయమైన వ్యూహాలు అవసరమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ప్రతినిధి కునాల్ ఘోష్ అభిప్రాయపడ్డారు. విపక్ష పార్టీల మధ్య అనుసంధానానికి సమన్వయ బృందం ఏర్పాటు అనివార్యమని నొక్కిచెప్పారు. ఈ మేరకు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించినట్టు వెల్లడించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సమన్వయ బృందం అవసరం మరింత ఎక్కువగా ఉన్నదని చెప్పారు.