ఆర్మీ దవాఖానకు ఎంపీ రఘురామ
- వైద్య పరీక్షలకు సుప్రీంకోర్టు ఆదేశం

హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్‌తోపాటు ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణరావు, ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరుతోపాటు ప్రైవేట్ దవాఖానలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్ చేసిన తీరును న్యాయస్థానానికి వివరించారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని, అరికాళ్లకు తగిలిన గాయాలను మేజిస్ట్రేట్‌కు ఆయన చూపించారని తెలిపారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఉన్నందున తమకు అభ్యంతరం ఉన్నదని, ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని రఘురామ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో పరీక్షలు ఆర్మీ దవాఖానలో ఎందుకు నిర్వహించకూడదని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఆర్మీ దవాఖానలో రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు ఒక న్యాయాధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. వైద్య పరీక్షలను వీడియో తీయాలని, నివేదికను సీల్డ్కవర్లో అందించాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

