సర్పంచ్ స్థానాలకు ఆశావాహుల తాకిడి.. ఒక్కో స్థానానికి ముగ్గురి నుండి ఐదుగురు పోటీ
Sarpanch Elections | స్థానిక సమరం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. రాజకీయ పార్టీల బీఫాములు అవసరం లేకున్నా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఒక్కో గ్రామంలో ముగ్గురు నుంచి అయిదుగురు ఆశావాహులు సర్పంచ్ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున్నారు.
Sarpanch Elections | భీమదేవరపల్లి, నవంబర్ 29: స్థానిక సమరం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. రాజకీయ పార్టీల బీఫాములు అవసరం లేకున్నా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఒక్కో గ్రామంలో ముగ్గురు నుంచి అయిదుగురు ఆశావాహులు సర్పంచ్ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలు సమావేశమై ఏకగ్రీవంగా ఒక్కో పార్టీ నుంచి ఒక్కరే నిలబడాలని అభ్యర్థిస్తున్న ఆశావాహులు ససేమిరా అంటున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ లో మొదటిసారిగా సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించారు. దీంతో ఓసీ వర్గానికి చెందిన కులస్తులు మొదటిసారి తమకు అవకాశం వచ్చిందని, సబ్బండ వర్గాలు తమను ఆశీర్వదించాలని విన్నవిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా బీసీలు పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారు. గ్రామంలో అధినాయకత్వం సర్వే జరిపి ఎవరికి సీటు కేటాయించాలో తేల్చి చెప్పాలని ఆశావాహులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు పోటీలో ఉన్న తాము వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముల్కనూర్ గ్రామం నుంచి ఓసి క్యాటగిరి నుంచి ఇద్దరు, బీసీ కేటగిరి నుంచి ముగ్గురు, ఎస్సీ క్యాటగిరి నుంచి ఇద్దరు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిని బుజ్జగించే ప్రయత్నం చేసిన వినకపోవడంతో ఈ పేచీ స్థానిక మంత్రి వద్దకు వెళ్ళింది. ఎవరు పోటీ చేయాలో మీరే తేల్చుకోవాలని, తాను ఎవరిని విరమించుకోమని చెప్పనని ఆయన బదులిచ్చినట్లు తెలిసింది.
నేడు నామినేషన్ స్వీకరణ చివరి రోజు కావడంతో గ్రామంలో స్థానిక సమరం మరింత వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ వరకు ఎవరెవరు స్థానిక సమరంలో ముందుంటారో.. ఎంతమంది ఉపసంహరించుకుంటారో వేచి చూడాల్సిందే…
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

