16 మంది ఎంపీలకు చీరలు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపడం సరికాదని, రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు రాజశేఖర్ ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు వెళ్లాలని సూచించారు.
- బీఆర్ఎస్ సీనియర్ నేత బట్టు రాజశేఖర్ నిరసన
ఇబ్రహీంపట్నం, జూలై 24: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపడం సరికాదని, రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు రాజశేఖర్ ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు వెళ్లాలని సూచించారు. బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ‘రాష్ట్రంలో మా పరిస్థితి ఇది’ అని పేర్కొంటూ నిరసన తెలిపేందుకు చీర, గాజులు, నల్ల మాస్కులను కొరియర్ ద్వారా పంపుతున్నట్టు చెప్పారు. నిరసన తెలిపేందుకు బానిసత్వం అడ్డువస్తే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, బిహార్ రాష్ర్టా ల్లా తాము కూడా ప్రాంతీయ పార్టీ ఎంపీలను గెలిపించుకొని నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం ఆయన గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసే లేకపోవడంపై రాష్ట్ర ఎంపీలు సిగ్గుపడాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రూ.15 వేల కోట్లు, బిహార్‌లోని నితీశ్ ప్రభుత్వం రూ.26 వేల కోట్లు తీసుకెళ్లిందని, తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలుండి రాష్ర్టానికి రూపాయి కూడా తీసుకరాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీకి, బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు బానిసలయ్యారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

