మణుగూరు టౌన్, నవంబర్ 14: వందలాది ఇసుక లారీలు గ్రామం మీదు గా రాకపోకలు సాగించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. 28 గంటలపాటు రహదారిపై టెంట్ వేసి బైఠాయించారు. లారీలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దు మ్ముధూళితో అనారోగ్యం పాలవుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్థుల నిరసనతో 200 ఇసుక లారీలు, సింగరే ణి లారీలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ నాగబాబు, సింగరేణి ఏజీఎం, పీవో, టీజీఎండీసీ పీవో శంకర్ నాయక్ ఆందోళనకారులను సముదాయించారు. గ్రామస్థుల నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.