Sammakka Sarakka | సమ్మక్క, సారలమ్మ దర్శనం నిలిపివేత.. ఎందుకంటే?
తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించారు.
- సమస్యలు పరిష్కరించలేదని పూజారుల తీర్మానం
Sammakka Sarakka | తాడ్వాయి, మే 19: తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించారు. వరంగల్‌లోని మేడా రం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు మం త్రులు, ఎమ్మెల్యేల ద్వారా దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్ మేడారం జాతర కార్యాలయం కోసం వరంగల్‌లో స్థలాన్ని కేటాయించారని, నిధులు సమకూరక భద్రాకాళి, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాల నుం చి 2 కోట్లు సేకరించి నగర నడిబొడ్డున ఆఫీ సు నిర్మించారని గుర్తుచేశారు.
ఈ భవనం లోనే అన్ని దేవాదాయ శాఖ కార్యాలయాలు కొనసాగుతున్నప్పటికీ.. మేడారం కార్యాలయాన్ని ఖాళీ చేయించి, వేద పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమ్మవార్లకు కేటాయించిన స్థలంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని కోరారు. ఈ క్రమంలోనే రెండు రోజులు దర్శనం నిలిపివేస్తామని, అధికారులు స్పందించకుంటే జూన్ మొదటి వారంలో వరంగల్‌లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

