Basthi Dawakhana | బస్తీ దవాఖానల్లో జీతాలు బంద్.. అప్పు చేయాల్సి వస్తున్నదని వాపోతున్న సిబ్బంది
పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి వస్తున్నదని వారు వాపోతున్నారు.
- 3 నెలలుగా అందని వేతనాలు
- వేతనాలు ఇవ్వాలని వేడుకోలు
Basthi Dawakhana | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి వస్తున్నదని వారు వాపోతున్నారు. తమకు వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ‘నా భర్త కొన్నేండ్ల కింద చనిపోయిండు. నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబానికి నా సంపాదనే ఆధారం. వచ్చే రూ. 8వేల జీతం కుటుంబపోషణకు కూడా సరిపోవడం లేదు. మూడు నెలలుగా ఆ జీతం కూడా రాక అప్పు చేస్తున్న.
ఇంకా ఎన్నిరోజులు ఇట్లా నెట్టుకురావాలో అర్థమైతలేదు’ అని మల్కాజిగిరి పరిధిలోని ఓ బస్తీదవాఖాన సహాయకురాలు కన్నీరుమున్నీరయ్యారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10వేల జనాభాకు ఒకటి చొప్పున బస్తీ దవాఖానను కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. జీహెచ్ఎంసీతోపాటు మున్సిపాలిటీల్లో కలిపి 400కుపైగా బస్తీ దవాఖానలు పనిచేస్తున్నాయి. ఒక్కో దవాఖానలో డాక్టర్ లేదా ఎంఎల్‌హెచ్‌పీ, ఫార్మసిస్టు, సహాయకులు ఉంటారు. వీరికి ఈ ఏడాది మార్చి నుంచి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

