Saddula Bathukamma | తెలంగాణలో ఘనంగా సద్దుల సంబరం.. ఆడిపాడిన మహిళలు
Saddula Bathukamma | యావత్ తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె నుంచి పట్నం వరకు వాడలన్నీ పూలవనాలుగా మారాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఉయ్యాల పాటలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొన్నది.
Saddula Bathukamma | యావత్ తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె నుంచి పట్నం వరకు వాడలన్నీ పూలవనాలుగా మారాయి. మహిళలు, యువతులు, చిన్నారుల ఉయ్యాల పాటలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొన్నది. ఈ నెల 2న ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు.. సద్దులతో ముగిశాయి. పూలనే పూజించే పండుగలో రాష్ట్రంలోని ఆడపడుచులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం గ్రామ, వార్డు కూడళ్లలోకి తీసుకొచ్చి ఉయ్యాల పాటలు పాడారు.
పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ ఆటలాడారు. ఇక హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వ అధికారికంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. సీఎంతో పాటు పలువురు మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మలతో శోభాయాత్ర అనంతరం క్రాకర్, లేజర్ షో ఏర్పాటు చేయగా.. అందరినీ అలరించింది. మరో వైపు హన్మకొండలోని పద్మాక్షి అమ్మవారి ఆలయం మహిళలతో కిక్కిరిసిపోయింది. బతుకమ్మలతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఆటలాడారు. చివరకు బతుకమ్మలను చెరువులు, నదులతో పాటు బతుకమ్మ ఘాట్లలో నిమజ్జనం చేసి వెళ్లిరా గౌరమ్మను సాగనంపారు. ఆ తర్వాత మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సిద్దిపేటలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు.. కలుపుమొక్క కాంగ్రెస్‌ను నమ్మితే సంక్షేమం సర్వనాశనమైంది : కేటీఆర్
Ranganath | హైడ్రా రంగనాథ్‌ను హైకోర్టుకు పట్టుకురండి.. డీజీపీకి న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్‌రెడ్డి ఆదేశం
Intermediate Education | ఇంటర్ విద్య రద్దు.. పీవీపై అక్కసుతోనే నిర్ణయమన్న ఇంటర్ జేఏసీ
IPL Player Trade | డీల్ డన్.. పాండ్యా, అర్ష్‌దీప్ ట్రేడింగ్‌కు ఆమోదం.. మళ్లీ రోహిత్‌కే ఎంఐ పగ్గాలు?
Ambulance Shortage | కొడంగల్ క్రిటికల్ కేర్..ట్రాక్టరే అంబులెన్స్ రేవంత్ ఇలాకాలో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

