హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌గా ఎస్ బిశ్వాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ కేంద్ర జల్‌శక్తిశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఈ బాధ్యతలను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ బీపీ పాండే చూస్తున్నారు. తాజాగా పూర్తికాలపు చైర్మన్‌గా ఎస్ బిశ్వాస్‌ను కేంద్రం నియమించింది. అదేవిధంగా సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్‌గా అనుపమ్ ప్రసాద్‌ను నియమించింది. ప్రస్తుత చైర్మన్ అతుల్ జైన్ విరమణ పొందగా, ఆయన స్థానంలో సీడబ్ల్యూసీలో రివర్ మేనేజ్మెంట్ విభాగం మెంబర్‌గా ఉన్న అనుపమప్రసాద్కు చైర్మన్‌గా ప్రమోషన్ కల్పించింది.