తెలంగాణ నుంచి బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ అవార్డును ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నది. బుధవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అవార్డును అందజేశారు. తెలంగాణ నుంచి అవార్డు అందుకోవడం ఇది వరుసగా మూడోసారి.