పట్టణాల కంటే గ్రామాల్లో ఎక్కువ యాక్టివ్ యూజర్లు
రెండేండ్లలో 61 శాతం పెరిగిన మహిళా యూజర్లు
నీల్సన్ భారత్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ యుగం నడుస్తున్నది. ఏం కావాలన్నా, ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ఇంటర్నెట్లో వెతుకులాట. ప్రపంచం చిట్టి ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు ఎప్పుడో మారిపోయింది. ఇంటర్నెట్ ఛార్జీలు కూడా తగ్గడంతో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నెట్ వినియోగం పెరిగిపోయింది. మన దేశంలో పట్టణాల కంటే పల్లెల్లోనే ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నదని, 2019తో పోలిస్తే 2021లో గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగం 45% వృద్ధి నమోదైందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నీల్సన్ భారత్ 2.0 పేరుతో నిర్వహించిన సర్వే వెల్లడించింది.
మహిళ ఇంటర్నెట్ యూజర్లు 61% పెరిగారు. దీంతో ఇంటర్నెట్ యూజర్లు పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో ఎకువగా ఉన్న ఏడాదిగా 2021 రికార్డుల్లోకి ఎక్కింది. 2021 డిసెంబర్ నాటికి దేశంలో 64.6 కోట్ల మంది యాక్టివ్ నెట్ యూజర్లు ఉన్నట్లు ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
నివేదికలో ముఖ్యాంశాలు..