కమీషన్ల కోసమే జీవో 17.. రాత్రికి రాత్రే తీసుకొచ్చిన రేవంత్ సర్కార్
‘రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల సరుకులు, వస్తువుల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందలాది కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపింది. ఒకేచోట కూర్చొ ని కమీషన్లు దండుకోవడానికే రేవంత్ సరార్ తన విధేయులైన అధికారులతో కలిసి రాత్రికి రాత్రే జీవో 17 తీసుకొచ్చింది.
- దోపిడీకి ఊతమిచ్చే ఆ జీవోను రద్దుచేయాలి
- సింగిల్‌విండో టెండర్లలో భారీ కుంభకోణం
- భద్రత తగ్గించినా, నా భార్యను ఇబ్బందులు
- పెట్టినా రేవంత్ సర్కార్‌పై పోరు ఆపబోను మేము చర్చలకు వెళ్తుంటే భయపడే అరెస్టులు
- బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజం
- ఆర్ఎస్పీ భార్యకు అప్రాధాన్య పోస్టు
- మరో 26 మందికి భద్రత కుదింపు
- ప్రవీణ్‌కు భద్రత కొనసాగించాలి:హైకోర్టు
హైదరాబాద్,జూలై 2(నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల సరుకులు, వస్తువుల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందలాది కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపింది. ఒకేచోట కూర్చొ ని కమీషన్లు దండుకోవడానికే రేవంత్ సరార్ తన విధేయులైన అధికారులతో కలిసి రాత్రికి రాత్రే జీవో 17 తీసుకొచ్చింది. దోపిడీకి ఊతమిచ్చే ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబా ద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. తన వ్యక్తిగత భద్రత తగ్గించినా, ఉ ద్యోగ విరమణ ముందు తన భార్యను ప్రాధా న్యం లేని శాఖలకు బదిలీ చేసి ఇబ్బందులు పె ట్టినా, రేవంత్ ప్రభుత్వ అవినీతిపై చేసే పోరాటంలో వెనుకంజ వేయబోను, ప్రశ్నించడం ఆపబోనని స్పష్టంచేశారు. ప్రభుత్వం అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే తనను, తన కు టుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం చర్యలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.
డీపీసీ రద్దు వెనుక మతలబు ఏమిటి?
డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ విధానాన్ని రద్దు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిట ని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘గతంలో అవకతవకలు జరిగాయని ఎవరైనా ఫి ర్యాదు చేశారా? ఎందుకు రద్దు చేశారు?‘ అని నిలదీశారు. జీవో నం.17 కేవలం సాంఘిక సంక్షేమ శాఖకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ, మాడల్ సూళ్లు, కేజీబీవీలతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపారు. మరి నోట్‌ఫైల్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, మైనారిటీ శా ఖల మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అజారుద్దీన్ సంతకాలు చేశారా? అని ప్రశ్నించా రు. హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించి, కి రాణా సామగ్రి సైప్లె కాంట్రాక్టును కేవలం ఇద్ద రు, ముగ్గురికే అప్పగించారని ఆరోపించారు.
ఎస్సీ బిడ్డలపై వివక్ష.. డ్రగ్ పెడ్లర్లకు కాంట్రాక్టులా?
టెండర్ల నిబంధనల్లో స్థానికతను తుంగలో తొకారని ఆర్ఎస్ మండిపడ్డారు. మన ఇండ స్ట్రీ పేరిట ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెంది న వ్యక్తి షూ టెండర్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఏకంగా రూ.300 కోట్ల టర్నోవర్ ఉండాలంటూ కొత్త నిబంధన పెట్టడం ఎంతవరకు న్యాయమని అడిగారు. టెక్స్టైల్ వ్యా పారం చేసే కంపెనీలకు లెదర్ కాంట్రాక్టులు, లెదర్ కార్పొరేషన్ కంపెనీలకు స్టేషనరీ టెండ ర్లు ఎలా ఇస్తారని నిలదీశారు. నిరంజన్కుమార్జైన్ అనే డ్రగ్ పెడ్లర్‌కు ట్రంక్ బాక్సుల సరఫరా కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని, ఈ బాక్సుల ద్వారా విద్యార్థులకు హెరాయిన్ సరఫరా చే యాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. జ యధీర్రెడ్డి, నిరంజన్ కుమార్‌జైన్, రమేశ్జైన్ కు టెండర్లు ఎలా దకాయో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
భయపడే అరెస్టులు
అన్ని ఆధారాలతో ప్రెస్‌క్లబ్‌కు వస్తామని తాము ముందే ప్రకటించామని ప్రవీణ్‌కుమా ర్ తెలిపారు. కాంగ్రెస్ మంత్రుల సవాల్‌ను స్వీకరించి గన్పార్ వద్దకు హరీశ్‌రావుతో కలిసి తాము వెళ్తుంటే భయపడి తమను అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పీఎస్‌కు తరలించారని ధ్వజమెత్తారు. ‘రేవంత్‌లాగా తొండలు, బండ లు, బుల్డోజర్లు, గుడ్లుపీకి గోళీలు ఆడుకొనే భాష మాకు రాదు. మేము కేవలం ఆధారాల తో రాష్టర ప్రభుత్వ కుంభకోణాన్ని బయటపెట్టడానికే సిద్ధమయ్యాం’అని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

