RS Praveen Kumar | గౌలిదొడ్డి గురుకుల పాఠశాల టీచర్లకు మూడు నెలలుగా జీతాల్లేవు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | ప్రపంచ స్థాయి కెదిగిన సంక్షేమ గురుకుల పాఠశాల గౌలిదొడ్డిలో గత మూడున్నర నెలలుగా జీతాలు రావడం లేదని సబ్జెక్టు నిపుణులు, సీనియర్ ఫ్యాకల్టీ సమ్మె చేయడమంటే మళ్లీ దళిత ఇతర పీడిత జాతులను రాతియుగం నాటి రోజులకు నెట్టే కుట్ర జరుగుతున్నదని స్పష్టంగా తెలుస్తున్నది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
RS Praveen Kumar | హైదరాబాద్ : ప్రపంచ స్థాయి కెదిగిన సంక్షేమ గురుకుల పాఠశాల గౌలిదొడ్డిలో గత మూడున్నర నెలలుగా జీతాలు రావడం లేదని సబ్జెక్టు నిపుణులు, సీనియర్ ఫ్యాకల్టీ సమ్మె చేయడమంటే మళ్లీ దళిత ఇతర పీడిత జాతులను రాతియుగం నాటి రోజులకు నెట్టే కుట్ర జరుగుతున్నదని స్పష్టంగా తెలుస్తున్నది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఆనాడు వేదం చదివాడని శంభూకునికి తల నరకడానికి, జ్ఞానం నేర్చుకోవాలని చూస్తే శూద్రుల చెవుల్లో సీసం కరిగించి పోయడానికి ఇప్పుడు కాంగ్రెసు కుట్రకు తేడా ఏమున్నది?? అని ప్రశ్నించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూర్తి బాధ్యత వహించాలి. మీకు తెలవకుండా ఈ కుట్రలు జరుగుతయా? అని నిలదీశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో స్వర్ణ యుగం చూసి ప్రపంచ స్థాయికెదిగిన గురుకులాలు ఇప్పుడు మృత్యుకుహరాలుగా మారాయి. గౌలిదొడ్డి లాంటి ఎన్నో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు వేల మంది పీడిత వర్గాల పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లుగా చేయడం కాంగీయులకు కళ్లు కుట్టినట్లుగా ఉన్నది. ఈనాడు గురుకులాల్లో సీవోఈ(CoE), క్రీడా అకాడమిల్లో పని చేస్తున్న ఫ్యాకల్టీ జీతాలు 3 నెలలుగా ఇవ్వకపోవడం అనేది పక్కాగా బీఆర్ఎస్ అభివృద్ధి చేసిన గురుకులాల మీద, దళిత వర్గాల మీద జరుగుతున్న అతి పెద్ద కుట్ర అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
తెలంగాణలో ఎంతో గొప్ప చైతన్యం కలిగిన ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, దళిత బహుజన విద్యార్థి సంఘాలు మన బిడ్డల భవిష్యత్ కోసం రోడ్డు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు విమాన టికెట్లకు, విలాసాలకు మాత్రమే కాకుండా తెలంగాణ ఫైనాన్స్ శాఖ గురుకుల ఫ్యాకల్టీ జీతాలు ఇవ్వడంలో శ్రద్ద చూపెడితే బాగుంటుంది భట్టి గారు. మీకు నిజంగా రాజ్యాంగం మీద నమ్మకముంటే ఈ పేద పిల్లల మెస్ ఛార్జీలు వెంటనే పెంచండి. పక్కా భవనాలు నిర్మించండి. తెలంగాణ పీడిత వర్గాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురుకుల ఫ్యాకల్టీ జీతాలు వెంటనే చెల్లించకపొతే ప్రజలు మరో తెలంగాణ గురుకుల పరిరక్షణ ఉద్యమానికి సిద్ధం అవుతారు అని హెచ్చరిస్తున్నాం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి కెదిగిన సంక్షేమ గురుకుల పాఠశాల గౌలిదొడ్డిలో గత మూడున్నర నెలలుగా జీతాలు రావడం లేదని సబ్జెక్టు నిపుణులు, సీనియర్ ఫ్యాకల్టీ సమ్మె చేయడమంటే మళ్లీ దళిత ఇతర పీడిత జాతులను రాతియుగం నాటి రోజులకు నెట్టే కుట్ర జరుగుతున్నదని స్పష్టంగా తెలుస్తున్నది.
ఆనాడు వేదం చదివాడని… pic.twitter.com/uTFIa1edsV
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 13, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

