Minister Srinivas Goud | గీత బీమా కింద గీత కార్మికులకు రూ.12.50 కోట్లు ఎక్స్ గ్రేషియా విడుదల : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud | గీత వృత్తిలో పనిచేస్తూ ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ప్రభుత్వం రూ.12.50 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేసింది.
హైదరాబాద్ : గీత వృత్తిలో పనిచేస్తూ ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ప్రభుత్వం రూ.12.50 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిధుల విడుదల వివరాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్( Minister Srinivas Goud)శనివారం వెల్లడించారు. గౌడ వృత్తిదారుల కోసం కోకాపేటలోని 5 ఎకరాలలో నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జరిగే భూమి పూజలో ఎక్స్ గ్రేషియా(Exgratia) ను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్(CM KCR)ఆదేశాల మేరకు ఇకపై గీత కార్మికులకు రైతుబీమా(Raitubeema) మాదిరిగా గీత కార్మికుల బీమా(Geeta Beema)ను అమలు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించినా, శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు అందించే ఎక్స్‌గ్రేషియాను నేరుగా వారి అకౌంట్లలో వారం రోజుల వ్యవధిలో జమ చేస్తామన్నారు. గీత కార్మికులు వారి ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు, లైసెన్సు వివరాలను, నామిని వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు అందజేయాలని సూచించారు.
బాధితులు సమీపంలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్లో వివరాలు వారం రోజుల వ్యవధిలో అందించాలని కోరారు. బీమా స్కీంను సమర్థవంతంగా అమలు అయ్యేలా విధివిధానాలు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫారాజ్ అహ్మద్‌ను మంత్రి ఆదేశించారు .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

