Jagadish Reddy | వానాకాలం రైతు బంధు వేస్తామని రేవంత్ మళ్లీ కొత్త డ్రామా : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారంపై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) వ్యవహారంపై విరుచుకుపడ్డారు. రైతు బంధు విషయంలో మరోసారి మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వానా కాలం రైతుబంధు వేస్తామని కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. యాసంగి మీ తాత ఇస్తాడా? అంటూ చురకలు అంటించారు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతు బంధును సక్కగా ఇచ్చినా కూడా రూ.30 వేల కోట్లు ఇంకా తెలంగాణ రైతులకి బాకీ ఉన్నావని విమర్శించారు. తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి మోసాలను గమనించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సర్ కార్యక్రమం ముగిసిన తరువాత ఎన్నికలకు వెళ్లనున్న దృష్ట్యా వానాకాలం రైతు బంధు వేస్తామని నాటకాలాడుతున్నారని, వానాకాలం, యాసంగి కాలం ఇవ్వాల్సిన బాకీని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బ్యాంకును కూడా బ్లాక్ మెయిల్ చేసే మొనగాడని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

