Revanth Reddy | 65 టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్న రేవంత్ రెడ్డి: ఓయూ విద్యార్థి నేత విజయ్ కుమార్
పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కురవ విజయ్‌కుమార్ ఆరోపించారు.
- రేవంత్ వసూళ్లపై ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేస్తాం
- రేవంత్‌రెడ్డిని జిల్లాల్లో తిరగనివ్వం
- ఓయూ విద్యార్థి నేత కురవ విజయ్‌కుమార్
Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కురవ విజయ్‌కుమార్ ఆరోపించారు. దీనిపై వెంటనే అధిష్ఠానం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రూ.600 కోట్ల వసూళ్లపై ఊరుకునే ప్రసక్తే లేదని, ఈడీ, ఐటీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం ఆయన తన అనుచరులతో కలిసి గాంధీభవన్‌ను ముట్టడించిన అనంతరం. మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు అండ్‌కో కబంధహస్తాల నుంచి కాంగ్రెస్‌ను కాపాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని విమర్శించారు. మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. గద్వాల టికెట్‌ను రూ.10 కోట్ల క్యాష్, 5 ఎకరాల భూమికి కొనుక్కున్నట్టు టికెట్ పొందిన సరితా తిరుపతయ్య బాహాటంగా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. గద్వాల మాత్రమే కాకుండా 65 నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి తన కుటుంబసభ్యులు, చెంచాల ద్వారా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. నోట్లు, ఓట్లు, సీట్ల అమ్మకాలు, కొనుగోళ్లలో ఆరితేరిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పరువును గంగలో కలుపుతున్నారని ధ్వజమెత్తారు. నమ్మించి మోసం చేసిన రేవంత్‌రెడ్డిని తమ జిల్లాలో తిరగనివ్వబోమని, తరిమి కొడతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

